logo

జిల్లాకు లక్ష మెట్రిక్‌ టన్నుల ఎరువులు

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 90వేల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనకాయలు కేటాయించినట్లు జేడీఏ చంద్రనాయక్‌ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలో డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 35వేల క్వింటాళ్ల విత్తనకాయలు ఆర్బీకేలకు చేరినట్లు తెలిపారు.

Published : 26 May 2022 03:53 IST


మాట్లాడుతున్న జేడీఏ చంద్రనాయక్‌

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 90వేల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనకాయలు కేటాయించినట్లు జేడీఏ చంద్రనాయక్‌ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలో డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 35వేల క్వింటాళ్ల విత్తనకాయలు ఆర్బీకేలకు చేరినట్లు తెలిపారు. 15వేల క్వింటాళ్ల వరకు రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 12వేల మంది సంబంధిత మొత్తం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈసారి కే6, 1812 రకాలు అందిస్తున్నట్లు చెప్పారు. విత్తన నాణ్యతలో రాజీకి అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. నాణ్యతలేదని భావిస్తే స్థానిక వ్యవసాయ అధికారులు లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 4,500 క్వింటాళ్ల కంది విత్తనం కూడా రాయితీతో అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది జిల్లాకు లక్ష మెట్రిక్‌ టన్నుల ఎరువులు కేటాయించినట్లు వివరించారు. ప్రస్తుతం 30వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గత ఏడాది ఆర్బీకేల ద్వారా 15శాతం వరకు ఎరువులు, మందులు విక్రయించామని, ఈ సంవత్సరం కనీసం 30 శాతం అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు. ఏడీఏ పద్మజ, ఏవోలు శశికళ, రామకృష్ణ, వెంకటరమణ, షేకన్న తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని