logo

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. మండలంలోని శ్రీరంగాపురం క్యాంపులో గురువారం కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించారు.

Published : 09 Dec 2022 06:18 IST

శ్రీరంగాపురంక్యాంపులో ధాన్యాన్ని  పరిశీలిస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, తెదేపా నాయకులు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. మండలంలోని శ్రీరంగాపురం క్యాంపులో గురువారం కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. వరి సాగుఖర్చులు పెరిగినా ప్రభుత్వం మద్దతు ధర అంతంతమాత్రంగానే ఉందన్నారు. బహిరంగ మార్కెట్లలో క్వింటాలు బీపీటీ సోనామసూరి రూ.2,100 నుంచి రూ.2,200 వరకు ఉందన్నారు. ప్రభుత్వం క్వింటాలుకు కనీసం రూ.2,500 ప్రకటించి మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలులో కమీషన్లకు కక్కుర్తిపడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి మొత్తం ధాన్యాన్ని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద ఉన్న రైస్‌మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపించారు. సరుకు దించుకొనే సమయంలో మిల్లర్లు, ప్రభుత్వం సిండికేట్‌గా మారి తరుగుపేరుతో క్వింటాలుకు ఆరు నుంచి ఏడు కిలోల వరకు కోతపెడుతున్నారన్నారు. బొమ్మనహాళ్‌, కణేకల్లు మండల కన్వీనర్లు బలరామిరెడ్డి, హనుమంతరెడ్డి, నాయకులు చలపతి, గోవిందు, వై.వెంకటేశులు, శ్యామల, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని