logo

రోడ్ల నిర్మాణానికి ఐదేళ్లు సరిపోలేదా జగన్‌!

ప్రజాస్వామ్యంలో గ్రామాభివృద్ధి నిరంతర ప్రక్రియ. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆ విధానం మారింది.

Published : 16 Apr 2024 03:08 IST

అర్ధాంతరంగా నిలిచిన తలమర్ల-ఇరగంపల్లి రహదారి పనులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే : ప్రజాస్వామ్యంలో గ్రామాభివృద్ధి నిరంతర ప్రక్రియ. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆ విధానం మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులపై పాలకులు కక్ష గట్టారు. ఐదేళ్లైనా పనులు పూర్తి చేయకపోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కొత్తచెరువు మండలంలో తెదేపా ప్రభుత్వంలో ఇరగంపల్లి-తలమర్ల, మరకుంటపల్లి-పోతులకుంట, లోచర్ల-మల్లెంపల్లి గ్రామాల రహదారుల నిర్మాణానికి రూ.4.50 కోట్ల మంజూరు చేశారు. పనులు ప్రారంభించి సగం పూర్తి చేశారు. ఇరగంపల్లి నుంచి తలమర్ల, మరకుంటపల్లి నుంచి పోతులకుంట వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లో నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయా గ్రామాల ప్రజలు భావించారు. అయితే వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రోడ్డు పనులకు గ్రహణం పట్టింది. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్డు పనులకు బిల్లులు మంజూరులో జాప్యం చేయడం కారణంగా గుత్తేదారు తప్పుకొన్నారు. దీంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కంకర తేలిన రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ మార్గం గుండానే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరంతరం తిరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వైకాపా ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని