logo

ఐదేళ్ల్లు నిద్రమత్తు ఎన్నికల వేళ కసరత్తు

ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకునేందుకు నాయకులు తహతహలాడుతున్నారు. తాడిపత్రిలో ఆసుపత్రి నూతన భవనం నిర్మాణంలో ఉంది ఇంకా ఫ్లోరింగ్‌ పనులు సాగుతూనే ఉన్నాయి.

Published : 16 Apr 2024 03:13 IST

తాడిపత్రిలో అత్యవసర చికిత్సలకు రేకుల షెడ్డే దిక్కు..

ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకునేందుకు నాయకులు తహతహలాడుతున్నారు. తాడిపత్రిలో ఆసుపత్రి నూతన భవనం నిర్మాణంలో ఉంది ఇంకా ఫ్లోరింగ్‌ పనులు సాగుతూనే ఉన్నాయి. వైద్య ఉపకరణాలు కూడా ఏవీ రాలేదు. 2019లోనే రూ.19 కోట్లు నిధులు మంజూరైనా అధికార పార్టీ నాయకుల అసమర్థతతో 2023 మార్చి దాకా పనులు ప్రారంభించనే లేదు. నిత్యం ఇక్కడికి కర్నూలు, కడప జిల్లాల నుంచి సుమారు 500 మంది రోగులు చికిత్సకు తరలివస్తారు.

అసంపూర్తిగా ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగం

కొత్త భవనం నిర్మాణ పనుల సమయంలో ఏమాత్రం చిత్తశుద్ధి చూపకుండా వదిలేశారు. ఇప్పుడేమో ఎన్నికల వేల అసంపూర్తిగా ఉన్న భవనాన్ని ఆగమేఘాల మీద ప్రారంభించి.. అంతా మేమే చేశాం అన్నట్లుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రారంభోత్సవాన్ని పూర్తి చేశారు. తీరా అక్కడికి వస్తున్న వందలాది రోగులకు మాత్రం రేకుల షెడ్డులో వైద్యం అందిస్తున్నారు. ఎండల తీవ్రతకు, అక్కడి దుర్వాసన భరించలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

న్యూస్‌టుడే, తాడిపత్రి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని