logo

నలుగురు వాలంటీర్ల తొలగింపు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నలుగురు గ్రామ/వార్డు వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

Published : 17 Apr 2024 05:46 IST

అనంతపురం (శ్రీనివాసనగర్‌), న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నలుగురు గ్రామ/వార్డు వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. వీరిలో రాయదుర్గం మండలం బొందనకల్‌ వాలంటీర్లు మంజునాథ్‌ నాయక్‌, పాపరాయుడు నాయక్‌, బోజరాజు, అనంత గ్రామీణ మండలం ఎ.నారాయణపురానికి చెందిన వాలంటీరు అఖిల భానులను విధుల నుంచి తొలగించారు. ఇప్పటిదాకా 69 మంది వాలంటీర్లు, 11 మంది డీలర్లు/ఎండీయూ ఆపరేటర్లు, 20 మంది ఒప్పంద ఉద్యోగులు, ముగ్గురు రెగ్యులర్‌ ఉద్యోగులు తొలగించిన వారిలో ఉన్నారు. మరోవైపు..ఇప్పటిదాకా రూ.2.79 కోట్ల నగదును సీజ్‌ చేశారు. 8,600 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు రూ.16.72 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని