logo

ఒకే రోజు యాభై నామినేషన్లు

జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి.

Published : 24 Apr 2024 05:17 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. అనంత లోక్‌సభ స్థానానికి కలెక్టర్‌/ఆర్‌ఓ వినోద్‌కుమార్‌ నామపత్రాలను స్వీకరించారు. బీఎస్పీ అభ్యర్థిగా హెచ్‌.నారాయణ, సమాజ్‌వాదీ పార్టీ తరఫున నిజామ్‌ షేక్‌లు నామినేషన్‌ వేశారు. మంగళవారం నాటికి మొత్తం 12 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఇక 8 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు 48 మంది అభ్యర్థులు 50 నామపత్రాలను సంబంధిత ఆర్వోలకు అందజేశారు. అత్యధికంగా అనంత అర్బన్‌లో 12 మంది 14 సెట్లను దాఖలు పరిచారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా తరిచి చూస్తే.. రాయదుర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంబీ చిన్నప్పయ్య, ఉరవకొండ నుంచి వైకాపా అభ్యర్థులుగా వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వై.ప్రణయ్‌రెడ్డి, అఖిల భారత కిసాన్‌ జనతా పార్టీ నుంచి కేబీ చిన్నక్క, బీఎస్పీ నుంచి ఎ.తిప్పేస్వామి, శింగనమల నుంచి తెలుగుదేశం నుంచి బండారు శ్రావణశ్రీ, బీఎస్పీ నుంచి కుందనం గౌతమి, అనంత అర్బన్‌కు తెదేపా నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, సీపీఐ నుంచి జాఫర్‌, బీఎస్పీ నుంచి కె.నాగరాజు, కళ్యాణదుర్గం ప్రాంతానికి వైకాపా తరఫున తలారి రంగయ్య, రాప్తాడు నియోజకవర్గానికి కాంగ్రెస్‌ తరఫున ఆది ఆంధ్ర శంకరయ్య, వైకాపా తరపున తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, టి.శైలజ నామినేషన్‌ వేసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని