logo

‘ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం’

ఎన్డీఏ కూటమి మంగళవారం విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికి సమ ప్రాధాన్యం కల్పించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజినప్ప పేర్కొన్నారు.

Published : 01 May 2024 03:51 IST

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎన్డీఏ కూటమి మంగళవారం విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికి సమ ప్రాధాన్యం కల్పించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజినప్ప పేర్కొన్నారు. ప్రధానంగా పేద, మహిళలు, నిరుద్యోగులు, యువత, కార్మికులు, రైతులు, నేతన్నలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రజాగళం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్‌, బీసీలకు రాజకీయంగా, శాశ్వత ధ్రువీకరణ పత్రాలు, యూదవ, కురుబ కులస్థులకు, నాయీబ్రాహ్మణులు, గీత కార్మికులు, వడ్డెర ఇలా అన్ని వర్గాలవారికి అవకాశాలు కల్పించటం బాగుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని