logo

వంతెన హామీకి రెండున్నరేళ్లు

అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలోని బుక్కరాయసముద్రం వద్ద వంకపై వంతెన నిర్మాణానికి వైకాపా ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి హామీ ఇచ్చి రెండున్నరేళ్లయింది.

Published : 01 May 2024 04:15 IST

వరదల సమయంలో పొంగి పొర్లుతున్న వంక

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలోని బుక్కరాయసముద్రం వద్ద వంకపై వంతెన నిర్మాణానికి వైకాపా ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి హామీ ఇచ్చి రెండున్నరేళ్లయింది. జాతీయ రహదారి కావడంతో నిత్యం 10 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ  మరువ వంక పారుతుండటంతో వరదలు వచ్చిన ప్రతిసారి రాకపోకలు స్తంభిస్తాయి 2021, 2022లో భారీగా వచ్చిన వర్షాలకు చిక్కవడియార్‌ చెరువు మరువ వంక పారింది. 2022లో వచ్చిన వరదకు వంకలో భారీ ట్యాంకర్‌ కొట్టుకుపోవడం అప్పట్లో రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించింది. దాదాపు ఇరవై రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులకు కీలకమైన రహదారిని వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వర్షాలు వచ్చిన ప్రతిసారి కాజ్‌వేపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంపై బుక్కరాయసముద్రం వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు.

వంతెన నిర్మాణం ఏదీ?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని