logo

ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి ఓటమి భయం : సునీత

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ఆయన సోదరులతో సొంత పార్టీ నాయకులనే బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారని, నియోజకవర్గంలో చాలాచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

Published : 02 May 2024 03:43 IST

అనంతపురం: తెదేపాలో చేరిన నాయకులతో పరిటాల సునీత

అనంతపురం(వ్యవసాయం), రాప్తాడు, న్యూస్‌టుడే: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ఆయన సోదరులతో సొంత పార్టీ నాయకులనే బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారని, నియోజకవర్గంలో చాలాచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. అనంత గ్రామీణం పామురాయికి చెందిన 45 మంది తాడిచెర్ల నుంచి వైకాపా ఉప సర్పంచి మల్లికార్జునతో పాటు పలువురు నాయకులు, సీకేపల్లి మండలం యర్రోనిపల్లి, ఆత్మకూరు మండలం వడ్డుపల్లి నాయకులు సునీత సమక్షంలో చేరగా, పరిటాల సిద్ధార్థ సమక్షంలో కనగానపల్లి మండలం బాలేపాళ్యం, అనంతపురం గ్రామీణం ధర్మభిక్ష కాలనీల నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు.

ప్రచారంలో భాగంగా ఆమె రాప్తాడు మండలం పాలబావి, చెర్లోపల్లి, గొల్లపల్లి, చాపట్ల, హంపాపురం గ్రామాల్లో పర్యటించారు. తెదేపా హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాప్తాడు మండల కన్వీనర్‌ కొండప్ప, కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని