logo

తండ్రిని ఒప్పించి.. జనాన్ని మెప్పించి

టెన్నిస్‌... ఖరీదైన క్రీడల్లో ఒకటి. ఇందులో పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. భారతీయ టెన్నిస్‌ క్రీడాకారులు సానియా మీర్జా, మహేష్‌ భూపతి స్ఫూర్తితో తిరుపతికి చెందిన ఎల్‌.శ్రీనివాస్‌ కార్తిక్‌ క్రీడలో రాణిస్తున్నాడు. కార్తిక్‌ ఎస్వీయూలో

Published : 20 Jan 2022 05:26 IST

టెన్నిస్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న కార్తిక్‌


శ్రీనివాస్‌ కార్తిక్‌

న్యూస్‌టుడే, తిరుపతి(క్రీడలు) టెన్నిస్‌... ఖరీదైన క్రీడల్లో ఒకటి. ఇందులో పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. భారతీయ టెన్నిస్‌ క్రీడాకారులు సానియా మీర్జా, మహేష్‌ భూపతి స్ఫూర్తితో తిరుపతికి చెందిన ఎల్‌.శ్రీనివాస్‌ కార్తిక్‌ క్రీడలో రాణిస్తున్నాడు. కార్తిక్‌ ఎస్వీయూలో ఎల్‌.ఎల్‌.బి ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పది సంవత్సరాల వయసు నుంచి టెన్నిస్‌ క్రీడపై ఆసక్తితో తండ్రి వెంకటరమణను ఒప్పించి శిక్షణలో చేరాడు. అప్పటి నుంచి శాప్‌ టెన్నిస్‌ శిక్షకుడు శశి వద్ద తర్ఫీదు పొందాడు. ఆటలో ముఖ్య అంశమైన సర్వీస్‌ చేయడంపై మెలకువలు నేర్చుకున్నాడు. పోరులో పాయింట్లు సాధించడంలో దిట్ట. మొదటి ప్రయత్నంగా పాఠశాల దశలో కేంద్రీయ విద్యాలయం తరఫున నాలుగుసార్లు జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి నాలుగు బంగారు పతకాలు సాధించాడు. స్కూల్‌ గేమ్స్‌లో ప్రశంసాపత్రాలతో సరిపెట్టుకున్నా.. నిరాశ చెందకుండా పట్టుదలతో సాధన చేశాడు. ఇటీవల తమిళనాడులోని ఎస్‌ఎంఆర్‌ యూనివర్సిటీలో జరిగిన దక్షిణాది అంతర విశ్వవిద్యాలయాల పురుషుల టెన్నిస్‌ టోర్నీలో కార్తిక్‌ ప్రతిభకనబరిచి ఎస్వీయూను నాలుగో స్థానంలో నిలిపాడు. వచ్చేనెల ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా జరగనున్న ఖేలో ఇండియా పోటీలకు టెన్నిస్‌లో జిల్లా నుంచి ఐదుగురు క్రీడాకారులు ఎంపిక కాగా, వీరిలో ఇతనొకడు. తండ్రి మార్గంలో న్యాయవాదిగా రాణించడంతోపాటు భారతదేశం తరఫున టెన్నిస్‌ ఆడాలనేదే తన లక్ష్యమని చెబుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని