logo

బాధిత కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

 చిత్తూరు జిల్లా రామకుప్పంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెదేపా వార్డు సభ్యుడు ఏలుమలై కుటుంబ సభ్యులతో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. 

Updated : 27 Nov 2022 15:19 IST

కుప్పం పట్టణం : చిత్తూరు జిల్లా రామకుప్పంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెదేపా వార్డు సభ్యుడు ఏలుమలై కుటుంబ సభ్యులతో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. పోలీసులు విచారణ సక్రమంగా చేపట్టి మృతికి కారణమైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధితులకు తక్షణ సహాయం కింద చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహార్ రూ.25వేలు అందించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. బంధువుల ఆగ్రహం

తెదేపా నాయకుడు ఏలుమలై మృతిపట్ల రామకుప్పం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హత్య జరిగితే అనుమానాస్పద మృతిగా కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తూ కుప్పం ఏరియా ఆస్పత్రి వద్ద మృతుడి బంధువులు ఎస్సై ఉమామహేశ్వర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని