logo

నిర్మాణాల మధ్య ప్రమాదకర చదువులు

పలమనేరు మండలం పెంగరగుంటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 520 మంది విద్యార్థులు 3-10వ తరగతి వరకు చదువుకుంటున్నారు.

Updated : 04 Dec 2022 04:47 IST

ఓ వైపు నాడు-నేడు పనులు జరుగుతుండగా.. మరో వైపు చదువుకుంటున్న విద్యార్థులు

పలమనేరు మండలం పెంగరగుంటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 520 మంది విద్యార్థులు 3-10వ తరగతి వరకు చదువుకుంటున్నారు. వీరికి కేవలం 10 గదులు మాత్రమే ఉన్నాయి. గదుల కొరత వల్ల ల్యాబ్లలోనూ, డిజిటల్‌ గదిలోని పరికరాల మధ్య కూర్చోని విద్యార్థులు పాఠాలు వింటున్నారు. మరో ఆరు సెక్షన్ల విద్యార్థులకు ఆరుబయటే బోధిస్తున్నారు. స్థలం లేక మరికొందరు నిర్మాణాల వద్దే కూర్చోని రాసుకుంటున్నారు. రెండో విడత నాడు-నేడు పనుల్లో భాగంగా 8 గదులు మంజూరు కాగా ఇప్పటికీ పూర్తికాలేదు. సిమెంట్‌ కొరతతో పనులు మందగించాయి. కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో ఇక్కడ పనులు వేగం పెంచాలని ఆదేశించటంతో కాస్త పనులు మొదలెట్టారు. అప్పటి వరకూ పనులు తూతూమంత్రంగా జరిగాయి. పునాదుల్ల్లోనే ఉన్న మూడంతస్తుల భవనం ఎప్పుడు పూర్తవుతుందో.. సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఈనాడు, చిత్తూరు, న్యూస్‌టుడే, పలమనేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని