logo

నియంత్రికలు కాలిపోవడాన్ని తగ్గించండి

వేసవిలో విద్యుత్తు వాడకం అధికం. ఈ నేపథ్యంలో నియంత్రికలు కాలిపోవడాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ చిత్తూరు రూరల్‌ డివిజన్‌ ఈఈ హరి పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 03:12 IST

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: వేసవిలో విద్యుత్తు వాడకం అధికం. ఈ నేపథ్యంలో నియంత్రికలు కాలిపోవడాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ చిత్తూరు రూరల్‌ డివిజన్‌ ఈఈ హరి పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక రూరల్‌ డివిజన్‌ కార్యాలయంలో ఏడీలు, ఏఈలతో సమీక్షించారు. హరి మాట్లాడుతూ విద్యుత్తు లైన్లను పరిశీలించి..ఎప్పటికప్పుడు ప్రమాదకరంగా ఉన్న లైన్లను మార్పు చేయాలన్నారు. లో ఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాల్లో కొత్త లైన్ల ఏర్పాటుకు దృష్టి సారించాలని చెప్పారు. జగనన్న కాలనీల ఇంటి సర్వీసుల జారీలో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్తు బకాయిల వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని