logo

రంజాన్‌ దీక్షలకు ఆటంకాలు లేకుండా చూస్తాం

రంజాన్‌ దీక్షలకు ఆటంకాలు లేకుండా చూస్తామని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ వసీమ్‌, వక్ఫ్‌బోర్డు కమిటీ జిల్లా వైస్‌ఛైర్మన్‌ గఫార్‌ఖాన్‌ తెలిపారు.

Published : 24 Mar 2023 02:09 IST

వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ వసీమ్‌తో వక్ఫ్‌ జిల్లా కమిటీ సభ్యులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: రంజాన్‌ దీక్షలకు ఆటంకాలు లేకుండా చూస్తామని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ వసీమ్‌, వక్ఫ్‌బోర్డు కమిటీ జిల్లా వైస్‌ఛైర్మన్‌ గఫార్‌ఖాన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్‌ కార్యాలయంలో గురువారం వారు సమావేశమయ్యారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు దీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్‌ అరుణ, విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన సదుపాయాలు కల్పిస్తుస్తున్నామన్నారు. ఇంకనూ ఏవైనా సమస్యలు ఉంటే 94400 03784, 98850 99188, 89198 92707 నంబర్లలో సంప్రదిస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వక్ఫ్‌ కమిటీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఫిరోజ్‌, సభ్యులు అక్రమ్‌, జునైద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని