logo

స్వదేశంలోనే విదేశీ విద్య

స్వదేశంలోనే విదేశీ విద్య అభ్యసించేలా అపోలో విశ్వవిద్యాలయంలో.. అపోలో, యూకేకు చెందిన లీసెస్టర్‌ విశ్వవిద్యాలయాలు సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Published : 16 Apr 2024 01:34 IST

అపోలో, లీసెస్టర్‌ విశ్వవిద్యాలయ ఒప్పందం

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ప్రతినిధులు

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: స్వదేశంలోనే విదేశీ విద్య అభ్యసించేలా అపోలో విశ్వవిద్యాలయంలో.. అపోలో, యూకేకు చెందిన లీసెస్టర్‌ విశ్వవిద్యాలయాలు సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మురకంబట్టులోని అపోలో విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌ ప్రొవోస్ట్‌, డిప్యూటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ హెన్రిట్టా ఓ కానర్‌ మాట్లాడారు. హెల్త్‌ కేర్‌, డేటా సైన్స్‌ రంగాల్లో విద్య, పరిశోధనల శక్తి ఉపయోగించి వాస్తవిక ప్రపంచంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో అపోలో విశ్వవిద్యాలయంతో జాయింట్ డిగ్రీ కోర్సు కోసం ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అపోలో వర్సిటీ వీసీ వినోద్‌భట్ మాట్లాడుతూ విదేశీ విద్య అభ్యసించాలంటే గతంలో ఏళ్ల తరబడి అక్కడే ఉండి చదువుకుంటూ రూ.కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం లీసెస్టర్‌ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదరడంతో చిత్తూరు అపోలోలో రెండేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరి, మూడో సంవత్సరం లీసెస్టర్‌ విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం చదువుకుంటే చాలని చెప్పారు. ఇంటర్‌ తరవాత చదివే జాయింట్ డిగ్రీ కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాయితీలు ఉంటాయన్నారు. లీసెస్టర్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ కెర్రీలా, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి నరేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని