logo

మే 3 నుంచి 6 వరకు పోస్టల్‌ బ్యాలెట్లు

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన ఈ నెల 25వ తేదీకల్లా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశించారు.

Updated : 16 Apr 2024 05:46 IST

17న జిల్లాకు ఎన్నికల పరిశీలకుల రాక
మే 10 లేదా 15న గంగమ్మ జాతర: కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రాల పరిశీలన ఈ నెల 25వ తేదీకల్లా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, నోడల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల విధులకు నియమించిన 12,500 మంది ఉద్యోగులకు మే 3 నుంచి 6 వరకు జరిగే శిక్షణలో పోస్టల్‌ బ్యాలెట్లు ఇస్తాం. శిక్షణ పూర్తయ్యాక అక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేయడంపై  ఈ నెల 21 నుంచి సర్వే చేపట్టి, ఫాం-12 తీసుకోవాలి. ఈ నెల 17న ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు. నోడల్‌ అధికారులు తమ విభాగాల వివరాలతో ఉండాలి. గంగమ్మ జాతర మే 10 లేదా 15న నిర్వహించుకునేందుకు పోలీసుల నుంచి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలి’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. అభ్యర్థుల నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ సమయంలో ఆర్‌వోల విధులను విశ్రాంత జేసీ వీఆర్‌ చంద్రమౌళి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలియజేశారు. 


 మౌనికకు అభినందన..

మౌనికను పుష్పగుచ్ఛం ఇస్తున్న కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు కలెక్టరేట్‌: ఇంటర్‌ ఫలితాల్లో ఎంపీసీలో జిల్లాలో అత్యధిక మార్కులు 991/1000 సాధించడం తోటు, రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిన చిత్తూరు నగరానికి చెందిన విద్యార్థిని మౌనికను కలెక్టర్‌ షన్మోహన్‌ సోమవారం అభినందించారు. మౌనిక తండ్రి ముత్తుకుమార్‌ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో సీనియర్‌ సహాయకులుగా పనిచేస్తున్నారు. జేసీ శ్రీనివాసులు, విద్యావికాస్‌ జూనియర్‌ కళాశాల నిర్వాహకులు ప్రకాష్‌చంద్రారెడ్డి, ప్రిన్సిపల్‌ రాజు, వైస్‌ ప్రిన్సిపల్‌ మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని