logo

రోడ్డు ప్రమాదంలో తెదేపా అభ్యర్థి థామస్‌కు గాయాలు

జీడీనెల్లూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి థామస్‌ ఆదివారం రాత్రి తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు.

Published : 16 Apr 2024 01:41 IST

హత్యకు యత్నించారని డ్రైవర్‌ ఆరోపణ

చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా అభ్యర్థి థామస్‌

పెనుమూరు, న్యూస్‌టుడే: జీడీనెల్లూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి థామస్‌ ఆదివారం రాత్రి తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. థామస్‌ కథనం మేరకు.. ‘వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీలో ఆదివారం రాత్రి బాబు స్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి చెన్నైకి బయలుదేరాô. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు సమీపంలో తాము ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మెడ వద్ద వెన్నుముకలో వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా. ఈ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి. మా కారుపైకి వెనుక నుంచి కంటైనర్‌ వేగంగా దూసుకొచ్చిందని, ఆ ప్రమాదాన్ని తప్పించే యత్నంలో డివైడర్‌ను ఢీకొట్టాల్సి వచ్చిందని డ్రైవర్‌ మురుగన్‌ అలియస్‌ జాన్‌ చెప్పారు. హత్యాయత్నమేమోనని అనుమానిస్తున్నాం.. దీనిపై ఫిర్యాదు చేయలేదు. అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించాలని కోరాం’ అని థామస్‌ చెప్పారు. మరోవైపు థామస్‌కు పెద్ద గాయాలు కాకపోవడంతో తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదంలో దెబ్బతిన్న కారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని