logo

ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు

ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..

Published : 18 Apr 2024 02:13 IST

వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని నిలదీసిన మహిళ

చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న మహిళ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు.. ఇప్పుడేమో ఓటు కోసం వచ్చారు.. అంటూ తిరుపతి గ్రామీణ మండలం బ్రాహ్మణపట్టుకు చెందిన ఓ మహిళ చంద్రగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని నిలదీసింది. మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణపట్టు గ్రామానికి వెళ్లిన మోహిత్‌రెడ్డి ఓ మహిళకు కరపత్రం అందజేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆమె స్పందిస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపులో ఒకేవర్గానికి ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారంటూ ఆరోపించారు. దరఖాస్తులు పట్టించుకున్న పాపానపోలేదని.. కావాలంటే పక్కనే ఉన్న మాజీ సర్పంచి సుబ్రహ్మణ్యంరెడ్డిని అడగండంటూ సూచించారు. సమాధానం చెప్పలేక ఇబ్బందిపడిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అక్కడి నుంచి చిన్నగా జారుకోగా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని