logo

వర్క్‌ ఆర్డర్లు క్లోజ్‌ చేయకపోతే వేతనాల్లో రికవరీ

వర్క్‌ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్‌ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 02:33 IST

ఇంజినీర్లతో సమీక్షిస్తున్న ఎస్‌ఏవో శ్రీనివాసులు

చిత్తూరు (మిట్టూరు): వర్క్‌ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్‌ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం స్థానిక చిత్తూరు అర్బన్‌ డివిజన్‌ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయకమిటీ సమావేశంలో మాట్లాడారు. 2022 వరకు పెండింగ్‌లో ఉన్న వర్క్‌ఆర్డర్లను క్లోజ్‌ చేయకపోతే.. సంబంధిత ఇంజినీర్లపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. బకాయిలు సత్వరమే వసూలు చేయాలన్నారు. మూడు నెలల పైబడి బకాయిలున్న సర్వీసులు తొలగించాలన్నారు. విద్యుత్తు బిల్లులను ప్రతి నెల ఏడో తేదీ లోగా జారీ చేయాలని తెలిపారు. సమావేశంలో డివిజన్‌ ఇన్‌ఛార్జి ఈఈ పద్మనాభపిళ్లై, డీఈఈలు, ఏఈలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని