logo

వైకాపా భూస్మాసురులు

పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం.

Updated : 20 Apr 2024 06:04 IST

 డీకేటీ భూములు స్వాహా

ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడి

 ఈనాడు-తిరుపతి: పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం.

 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చి ప్రస్తుత ఎంపీ మద్దెల గురుమూర్తి పేరిట రెండు ఎకరాల డీకేటీ భూమి ఉంది. మన్నసముద్రం గ్రామంలోని 332/5 సర్వే నంబరులో 2018లో ప్రభుత్వం ఆయనకు ఇచ్చినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. ఈయన పేరిట సొంతంగా కారు లేదు. ఎంపీ భార్య పేరుతో మాత్రమే కారు ఉన్నట్లు చూపించారు.

 గూడూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌కు సైతం డీకేటీ భూమి ఉంది. ఆయన పేరిట రాపూరులోని 1148/1 సర్వే నంబరులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఆయనకు రాపూరులో సుమారు 42 అంకణాల్లో (5190 చ.అ.)ల విస్తీర్ణంలో రూ.1.50 కోట్ల విలువైన వాణిజ్య భవనం ఉంది. రూ.73.81 లక్షల అప్పులున్న మేరిగ మురళీధర్‌కు నిరుపేదలకు దక్కాల్సిన డీకేటీ పట్టాలు ఉండటం గమనార్హం.

  • మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ పేరిట రూ.41,974 మాత్రమే ఉన్నాయి. చేతిలో రూ.40వేలు, హరేకృష్ణ ఎస్‌బీఐ బ్రాంచిలో రూ.1974 మాత్రమే ఉన్నట్లు ఎన్నికల సంఘానికి నివేదించారు.
  • సత్యవేడు కూటమి అభ్యర్థి ఆదిమూలం, అతని భార్య వద్ద 60 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. వీటి విలువ రూ.1.80 లక్షలు కావడం గమనార్హం.
  • సూళ్లూరుపేట కూటమి అభ్యర్థిని నెలవల విజయశ్రీకి పేరిట 1.75 ఎకరాలు, భర్త పేరుతో ఎకరం భూమి మాత్రమే ఉంది. దంపతులిద్దరికీ కలిపి 150 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. విజయశ్రీ పేరుతో రెండు గ్యాస్‌ ట్యాంకర్లు, ఓమినీ బస్సు, అశోక్‌ లేల్యాండ్‌ స్టేజి క్యారియర్‌ ఉన్నాయి.

లోక్‌సభ స్థానం- తిరుపతి

  •  అభ్యర్థి : మద్దిల గురుమూర్తి
  •   పార్టీ : వైకాపా
  •  ఐటీ చెల్లింపులు : రూ.12,16,960 (2022-23)
  •  ఆస్తుల విలువ : రూ.67,91,014
  •  భార్య పేరిట : రూ.51,42,520
  •  అప్పులు : రూ.10,97,657

    లోక్‌సభ స్థానం: తిరుపతి

  •  అభ్యర్థి : చింతా మోహన్‌
  •  పార్టీ : కాంగ్రెస్‌
  •  ఐటీ చెల్లింపులు : 6,60,000 (2022-23)
  •  ఆస్తుల విలువ : రూ.41,974
  •  భార్య పేరిట : రూ.2,27,33,300
  • అప్పులు : లేవు

    అసెంబ్లీ - గూడూరు

  • అభ్యర్థి : మేరిగ మురళీధర్‌
  •  పార్టీ : వైకాపా
  •  ఐటీ చెల్లింపులు : రూ.6,95,180 (2022-23)
  •  ఆస్తుల విలువ : రూ.2,12,68,850
  •  భార్య పేరిట : రూ.66,30,000
  • అప్పులు : రూ.73,81,740

    అసెంబ్లీ: సత్యవేడు

  •  అభ్యర్థి : కోనేటి ఆదిమూలం
  •  పార్టీ : తెదేపా
  • ఐటీ చెల్లింపులు : రూ.2,580 (2022-23)
  • ఆస్తుల విలువ : రూ.85,71,198
  •  భార్య పేరిట : రూ.10,47,719
  •  అప్పులు : లేవు

    అసెంబ్లీ: సూళ్లూరుపేట

  •  అభ్యర్థి : నెలవల విజయశ్రీ
  •  పార్టీ : తెదేపా
  •  ఐటీ చెల్లింపులు : 6,12,212 (2023-24)
  •  ఆస్తుల విలువ : రూ.1,22,59,034
  •  భర్త పేరిట : రూ.2,05,05,000
  •  అప్పులు : రూ.65,41,370
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని