logo

పోలీసులకు ఒక్కరోజే..!

ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 02 May 2024 05:09 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికకు ఏర్పాట్లు
5 నుంచి 7 వరకు నిర్వహణ

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ జరగనుంది. జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 26,498 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసు సిబ్బంది ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అర్హులను గుర్తించి సంబంధిత ఎన్నికల అధికారులకు జాబితాను నివేదించింది. ఈనెల 5వ తేదీన పోలీసులకు, 6, 7వ తేదీల్లో ఇతర శాఖల ఉద్యోగులు పోలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. విభిన్న ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఇవ్వడంపై విమర్శలు నెలకొంటున్నాయి. అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలంటే మూడురోజులూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద టర్న్‌ డ్యూటీలకు తిరుపతి జిల్లా నుంచి 20 మందిని ఒకటి రెండు రోజుల్లో పంపనున్నారు. వీరు ఓటింగ్‌కు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని