logo

ఎ‘వరి’కి చెప్పుకోవాలో

కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రత అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉద్యాన పంటలు, పశుపోషణపై ఆధారపడిన రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు.

Published : 02 May 2024 05:30 IST

పశ్చిమ ప్రాంతంలో సాగునీటి కష్టాలు
ట్యాంకర్లతో అందిస్తూ రైతుల భగీరథ యత్నం

 శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి వద్ద పశుగ్రాసం పంటకు ట్యాంకరు నీటిని అందిస్తున్న రైతు

కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రత అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉద్యాన పంటలు, పశుపోషణపై ఆధారపడిన రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. బోర్లు అడుగంటి పోవడంతో.. విధిలేని పరిస్థితుల్లో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పంటలకు తడులుగా అందిస్తున్నారు. ముఖ్యంగా వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో రబీ సీజన్‌లో వరి సాధారణ సాగు 10,530 హెక్టార్లు కాగా సగానికి పడిపోయింది. అందులోనూ శాంతిపురం మండలంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోవడంతో ట్యాంకర్లతో నీటి అందిస్తూ కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు పైపులైన్లు, మరి కొందరు ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి నీటి అందిస్తూ పంటల రక్షణకు యత్నిస్తున్నారు.

న్యూస్‌టుడే, శాంతిపురం, పుంగనూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని