logo

ఆలస్యమైనా వేటు తప్పదు..!

అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది.

Published : 25 Apr 2024 03:38 IST

వైకాపా అనుకూల పోలీసులకు హెచ్చరిక

ఆర్వో కార్యాలయంపై ఎగురుతున్న డ్రోన్‌ కెమెరా

కుప్పం పట్టణం: అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. అంతకుముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలపైనా వేటుపడింది. ఇవన్నీ కళ్ల ఎదుట కనిపిస్తున్నా.. జిల్లాలో అధికారుల తీరు మారటం లేదు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరీ ఎక్కువగా ఉంది.

పోలీసుల అత్యుత్సాహం : ఈసీ కఠిన వ్యవహారశైలి తెలిసినా పోలీసులు మాత్రం ఇక్కడి వైకాపా నాయకులకు కళ్లు, చెవులుగా మారిపోయారు. వాళ్లు చెప్పినవ్నీ వింటూ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఇటీవల ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటన సందర్భంగా కఠినంగా వ్యవహరించారు. అదే కుప్పం వైకాపా అభ్యర్థి భరత్‌ సతీమణి దుర్గ వస్తున్నారంటే పోలీసులు బ్రహ్మరథం పట్టారు. ఆమె కారును నేరుగా ఆర్వో కార్యాలయంలోనికి అనుమతించారు. డీఎస్పీ సైతం ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ః భువనేశ్వరి పర్యటనకు వెళ్లిన ఎస్టీలపై రామకుప్పం ఎస్‌ఐ శివకుమార్‌ జలుం ప్రదర్శించారు. యానాది తండాలోకి సిబ్బందితో ప్రవేశించి బెదిరిస్తూ తుపాకులు, ఆధార్‌కార్డులు తీసుకురావాలని హకుం జారీచేశారు. దీనిపై బాధితులు ఎస్‌ఐ కులంపేరుతో దూషించారని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు ఎస్సీ, ఎస్టీలైతే కచ్చితంగా డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టాలి. ఇందులోనూ పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ః తాజాగా ఆర్వో కార్యాలయంపైనా డ్రోన్‌ ఎగిరిన ఘటనలోనూ పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని