logo

‘కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నా’

కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్లు బీఎన్‌ కండ్రిగ మండలం చిన్నపాలవేడు గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య తెలిపారు. శనివారం ఆయన కూటమి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 05 May 2024 02:59 IST

ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: కూల్చివేతల వైకాపాలో ఇమడలేక తెదేపాలో చేరుతున్నట్లు బీఎన్‌ కండ్రిగ మండలం చిన్నపాలవేడు గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్పీ రమేషయ్య తెలిపారు. శనివారం ఆయన కూటమి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో తెదేపాలో చేరారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన రోజునుంచే ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడిపారన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెల్లిందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, మోదీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధివైపు నడుస్తుందని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అన్నివిధాలుగా కృషి చేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని