logo

అండగా ఉంటాం.. ఆదరించండి

ప్రజలకు అండగా ఉంటాం.. ఆదరించండని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌, ఆయన సతీమణి ప్రతిమ, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, సాయికృష్ణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చర్చివీధి, మార్కెట్‌ చౌక్‌, 3, 7వ డివిజన్లతో పాటు, శంకరయ్యగుంటలో వారు విడివిడిగా ప్రచారం చేశారు.

Updated : 05 May 2024 04:47 IST

చిత్తూరు: ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న గురజాల

చిత్తూరు(జిల్లా పంచాయతీ): ప్రజలకు అండగా ఉంటాం.. ఆదరించండని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌, ఆయన సతీమణి ప్రతిమ, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, సాయికృష్ణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చర్చివీధి, మార్కెట్‌ చౌక్‌, 3, 7వ డివిజన్లతో పాటు, శంకరయ్యగుంటలో వారు విడివిడిగా ప్రచారం చేశారు. శంకరయ్యగుంటలో రౌడీమూకలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు సీకేబాబు, ఆయన తనయుడు సాయికృష్ణారెడ్డికి తెలపగా.. అండగా ఉంటామని వారు హామీనిచ్చారు. అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. నగరపాలక కోఆప్షన్‌ సభ్యురాలు నళిని తిరుకుమరన్‌, త్యాగరాజన్‌, శంకర్‌, గోపాలకృష్ణ, బాబురెడ్డి, కార్పొరేటర్‌ అశోక్‌, మాజీ కార్పొరేటర్‌ మురళీ, సుబ్రహ్మణ్యం, హేమంత్‌, రహ్మతుల్లా పాల్గొన్నారు.

గుడిపాల: అభ్యర్థి గురజాల జగన్‌.. మండిక్రిష్ణాపురం, పెరుమాళ్లకుప్పం, కనకనేరి, గొల్లమడుగు, చింతగుంటూరు, పల్లూరు ఆది,ఆంధ్రవాడ, వసంతాపురం, బసవాపల్లె, కట్టకిందపల్లె దళితవాడలు, కోలావూరు, చెరుకూరుకండ్రిగలో ప్రచారం చేశారు.

నగరి: చంద్రబాబు సీఎం కావాలని తెదేపా నాయకుడు చలపతి సామాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఒకటో వార్డులో ప్రచారం నిర్వహించారు.

పుత్తూరు: ఆటో కార్మికులు టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాధవులునాయుడు ఆధ్వర్యంలో అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. తొరూరు నుంచి దళవాయి మాధవ.. జిల్లా ఉపాధ్యక్షుడు గంజి మాధవయ్య సమక్షంలో చేరారు. పట్టణ, మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవరత్నం, రవికుమార్‌, ధనపాల్‌, బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి చినబాబు పాల్గొన్నారు.

వడమాలపేట: డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ అమాస రాజశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి.. భానుప్రకాష్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు.

పెనుమూరు: కూటమి అభ్యర్థి థామస్‌.. పెనుమూరులో నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

వెదురుకుప్పం: ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు నిధి కురివికుప్పం పంచాయతీలోని పలు గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.

కార్వేటినగరం: అభ్యర్థి థామస్‌.. ఆర్‌కేవీబీపేటలో బాబు స్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన బాధ్యుడు పొన్నా యుగంధర్‌, భాజపా మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ పాల్గొన్నారు. పూతలపట్టు: మురళీమోహన్‌ సమక్షంలో  పారిశ్రామికవేత్త సౌందర్యరాజన్‌ తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని