logo

స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రత

మహిళా వర్సిటీలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉన్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 18 May 2024 04:14 IST

అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

తిరుపతి(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: మహిళా వర్సిటీలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉన్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం వర్సిటీలోని స్ట్రాంగ్‌ రూంలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ కేంద్రాన్ని నగరపాలక కమిషనర్‌ అదితిసింగ్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌రూం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కఠినంగా అమల్లో ఉంటుందన్నారు. అనంతరం అధికారులతో భద్రతకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్‌ చర్చించారు. వెంట ఆర్వోలు నిషాంత్‌రెడ్డి, నరసింహులు, అదనపు ఎస్పీ కులశేఖర్, డీఆర్వో పెంచల కిషోర్‌ తదితరులు ఉన్నారు.


హింసాత్మక ఘటనలకు  తావుండకూడదు: సీఈవో మీనా

తిరుపతి(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఈనెల 4న జరిగే ఎన్నికల కౌంటిగ్‌ రోజున, ఆ తరువాత రోజుల్లో జిల్లాల్లో హింసాత్మక సంఘటనలకు తావులేకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా అన్నారు. శుక్రవారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్‌రెడ్డితో కలిసి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్వో పెంచల కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని