logo

న్యాయమూర్తి ఔదార్యం.. అనాథకు ఆశ్రయం

పిఠాపురానికి చెందిన గురుప్రసాద్‌(75) మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం దత్తగిరి ఆశ్రమానికి వచ్చారు. అనారోగ్యంతో కదల్లేకుండా ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానిక సర్పంచి, ఆశ్రమ నిర్వాహకులు 108లో ఆసుపత్రికి

Published : 22 Jan 2022 05:23 IST


గురుప్రసాద్‌ను తరలిస్తున్న ఆసుపత్రి సిబ్బంది

సంగారెడ్డి (జహీరాబాద్‌ అర్బన్‌): పిఠాపురానికి చెందిన గురుప్రసాద్‌(75) మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం దత్తగిరి ఆశ్రమానికి వచ్చారు. అనారోగ్యంతో కదల్లేకుండా ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానిక సర్పంచి, ఆశ్రమ నిర్వాహకులు 108లో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి బాధితుడితో మాట్లాడారు. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌, ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ శేషురావు సహకారంతో దుండిగల్‌లోని అనాథాశ్రమానికి తరలించే ఏర్పాట్లు చేయించారు. గురుప్రసాద్‌ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఉంటూ రికార్డింగ్‌ స్టుడియో నిర్వహించినట్లు తెలిసింది. అతని కూతురు చరవాణికి ఫోన్‌ చేయగా సమాధానం రాలేదు. తండ్రిని భారంగా భావించిన కన్నబిడ్డలే బర్దీపూర్‌ ఆశ్రమం వద్ద వదిలేసి వెళ్లిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని