logo

చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాకారం

ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ అన్నారు.

Published : 26 Apr 2024 04:50 IST

తెదేపా స్టార్‌ క్యాంపైనర్‌గా కేఎస్‌ జవహర్‌

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 పార్లమెంటు స్థానాల పరిధిలో 36 నియోజకవర్గాల్లో ప్రచారానికి స్టార్‌ క్యాంపైనర్‌గా గురువారం ఆయన నియమితులయ్యారు. 2014లో తెదేపా నుంచి ఎమ్మెల్యే అయిన ఆయన ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో తిరువూరు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం రాలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా దక్కింది. తాజాగా జవహర్‌ స్టార్‌ క్యాంపైనర్‌గా నియామకం అయ్యారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పుజిల్లాల పరిధిలోని తుని, పెద్దాపురం, జగ్గంపేట, రామచంద్రపురం, కొత్తపేట, ఆచంట, తణుకు, రాజమహేంద్రవరం గ్రామీణం, గోపాలపురం, దెందులూరు, ఏలూరు, నూజివీడు నియోజకవర్గాలతో పాటు మరో 24 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేపట్టేలా కార్యాచరణ అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా జవహర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తానని, అధినేత చంద్రబాబు ఆశయాలను నెరవేరుస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని