logo

బడిబయటి పిల్లల వివరాలపై నివేదికకు ఆదేశం

జిల్లాలో పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులు(డ్రాపౌట్స్‌) వివరాలు సేకరించి సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ, ఇంజినీరింగ్‌, మండలస్థాయి అధికారులతో

Published : 05 Oct 2022 05:23 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లాలో పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులు(డ్రాపౌట్స్‌) వివరాలు సేకరించి సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ, ఇంజినీరింగ్‌, మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 6,488 మంది డ్రాపౌట్స్‌ పిల్లలు ఉన్నారని, వీరిని పాఠశాలకు రప్పించే విషయంలో ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు బడిబయట పిల్లల ఇళ్లకు వెళ్లి వారిని పాఠశాలలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

* ‘నాడు-నేడు’ పనులపై సమీక్ష: జిల్లాలోని ఆయా పాఠశాలల్లో జరుగుతున్న ‘నాడు-నేడు’ పనులపై కలెక్టర్‌ సమీక్షించారు. పూర్తయిన పనుల వివరాలు ఫొటోలతో సహా వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. ఈ విషయంలో ఇంజినీరింగ్‌ సహాయకులు వ్యక్తిగత చొరవ చూపాలన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, సర్వశిక్షాభియాన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, ఆయా మండల పరిధిలోని అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు ప్రగతి అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని