logo

అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎస్‌ఈబీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఈబీ ఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి తెలిపారు.

Published : 16 Apr 2024 03:42 IST

'అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎస్‌ఈబీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఈబీ ఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు చేపట్టాల్సిన చర్యలను వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఖాదర్‌ బాషా, డీఈఎస్‌వో రాజ్యలక్ష్మి, అమరబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


నగదు, మద్యం స్వాధీనం

న్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో న్విహించిన దాడుల్లో అక్రమ మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీధర్‌ సోమవారం తెలిపారు. అమలాపురం పరిధిలో రెండు లీటర్ల సారా, 2500 లీటర్ల బెల్లం ఊట, కొత్తపేట పరిధిలో 100 లీటర్ల సారా, 300 బెల్లంఊట, రామచంద్రపురంలో 24 మద్యం సీసాలు, ఎస్‌ఈబీ అధికారుల దాడుల్లో 60 మద్యం సీసాలు, 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.మండపేట పరిధిలో రూ.1.28లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని