logo

శుక్రవారం పిఠాపురంలో పవన్‌ రోడ్‌ షో

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రోడ్ షో నిర్వహించినట్లు జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ తెలిపారు.

Published : 09 May 2024 21:10 IST

పిఠాపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రోడ్ షో నిర్వహించినట్లు జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో రోడ్ షో పవన్ ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడ నుంచి పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువు, పాదగయ కూడలి, ప్రభుత్వ ఆసుపత్రి, ఉప్పాడ సెంటర్, కోట గుమ్మం సెంటర్, చర్చి సెంటర్, పశువుల సంత, మీదుగా గొల్లప్రోలు పట్టణం చేబ్రోలు వరకు సాగుతుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి అదే ప్రాంతం నుంచి ఏకే మల్లవరం,  మూలపేట అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్, వాకతిప్ప, కొత్తపల్లి, ఎండపల్లి, కొండవరం మీదుగా తిరిగి పిఠాపురం చేరుకుంటుంది పలు ప్రాంతాల్లో పదినిమిషాల పాటు పవన్ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని