logo

‘రాక్షస పాలనకు ఓటుతో అంతం పలుకుదాం’

రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు ప్రజలు ఓటుతో అంతం పలకాలని సినీ నటుడు నారా రోహిత్‌ పిలుపునిచ్చారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం, ఆరుంబాక గ్రామాల్లో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళవారం మాట్లాడారు.

Published : 08 May 2024 06:05 IST

మాట్లాడుతున్న నారా రోహిత్‌, పక్కన హాస్యనటుడు రఘు

చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు ప్రజలు ఓటుతో అంతం పలకాలని సినీ నటుడు నారా రోహిత్‌ పిలుపునిచ్చారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం, ఆరుంబాక గ్రామాల్లో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళవారం మాట్లాడారు. మన పూర్వీకులు రెక్కల కష్టంతో సంపాదించిన ఆస్తులపై జగన్‌ ఫొటో ఎందుకు ఉండాలని ధ్వజమెత్తారు. మన భూములపై జగన్‌ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, ఉపాధి అని చేపలు, గొర్రెలు పెంచుకోవడం కాదన్నారు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందని సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారన్నారు. భావితరాల భవిష్యత్తు బంగారం కావాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ పటంలో ఉందని, నేడు జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిందని విమర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు, మహిళలకు భద్రత భరోసా ఉంటుందని చెప్పారు. హాస్యనటుడు రఘు, తెదేపా నేతలు కుమారస్వామి, మూర్తి, నాగమల్లేశ్వరి, మోహనబాబు, సాంబయ్య, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు