logo

సజావుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ మూడో రోజు సజావుగా సాగింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మంగళవారం పోలింగ్‌ కేంద్రాల్లో 2516 ఓట్లు పోలయ్యాయి.

Published : 08 May 2024 06:10 IST

ఓటు హక్కు వినియోగించుకున్నాక వేలిపై  సిరా గుర్తు చూపుతున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ బిందుమాధవ్‌

నరసరావుపేట అర్బన్‌ న్యూస్‌టుడే : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ మూడో రోజు సజావుగా సాగింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మంగళవారం పోలింగ్‌ కేంద్రాల్లో 2516 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా నరసరావుపేటలో 645 మంది వేశారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు నియోజకవర్గంలో 2859 మంది ఉన్నారు. దరఖాస్తు చేసుకోని వారు కూడా వచ్చి ఓట్లు వేయవచ్చని అధికారులు వెసులుబాటు కల్పించడంతో 3049 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు మాచర్ల నియోజకవర్గానికి ఆర్వోగా వ్యవహరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 16,282 ఓట్లకు గాను 16,037 ఓట్లు పోలయ్యాయి. 98.50 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు.


నేటి నుంచి ఇంటి వద్ద ఓటింగ్‌

నరసరావుపేట అర్బన్‌ న్యూస్‌టుడే: జిల్లాలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు కల్పించిన హోం ఓటింగ్‌ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్‌ తెలిపారు. జిల్లాలో వయోవృద్ధులు 714 మంది, దివ్యాంగులు 636 మంది  ఇంటి వద్దనే ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం 41 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 246 మంది సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఓట్లు వేయిస్తారన్నారు. 8, 9 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓట్లు వేయిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1350 మంది హోం ఓటింగ్‌ను వినియోగించుకుంటారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు