logo

ఉద్యోగుల ఓటింగ్‌ 40 శాతం

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సిబ్బంది తపాలా ఓట్ల పోలింగ్‌ కొనసాగుతోంది.

Published : 09 May 2024 06:24 IST

బాపట్ల, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సిబ్బంది తపాలా ఓట్ల పోలింగ్‌ కొనసాగుతోంది. ఇతర జిల్లాల్లో ఓటు ఉన్న ఉద్యోగులు తమ తపాలా ఓటును బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం వినియోగించుకున్నారు. మొత్తం 887 తపాలా ఓట్లకు గాను 354 ఓట్లు పోలయ్యాయి. 40 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగింది. పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉండటం వల్ల తమ తపాలా ఓటు వేయలేకపోయారు. వీరికి గురువారం ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. బాపట్ల ఆర్వో కార్యాలయంలో 269 మంది తపాలా ఓటు వేశారు. తపాలా ఓటు కోసం ఉద్యోగులు అందించిన ఫారం-12 దరఖాస్తులు గల్లంతు కావటంతో వారు ఓటు వేయలేకపోయారు. వీరిని ఆయా జిల్లాల్లో సొంత నియోజకవర్గాలకు వెళ్లి శుక్రవారం ఓటు వేయొచ్చని అధికారులు సూచించారు. సుదూర జిల్లాలు, ప్రాంతాల్లో ఓటు ఉన్న ఉద్యోగులు వెళ్లటానికి ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్‌ను ఆర్వో,  జేసీ శ్రీధర్‌ పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు