logo

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. సంగారెడ్డి పట్టణ సీఐ బైరి రమేశ్‌ తెలిపిన వివరాలు.. అందోలు మండలం అల్మాయిపేటకు చెందిన బుచ్చిరెడ్డిగారి గోపాలకృష్ణారెడ్డి (46) కార్పెంటర్‌.

Published : 06 Dec 2021 02:27 IST

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. సంగారెడ్డి పట్టణ సీఐ బైరి రమేశ్‌ తెలిపిన వివరాలు.. అందోలు మండలం అల్మాయిపేటకు చెందిన బుచ్చిరెడ్డిగారి గోపాలకృష్ణారెడ్డి (46) కార్పెంటర్‌. నిత్యం సంగారెడ్డిలో పని పూర్తయిన తర్వాత స్వగ్రామం వెళుతుంటారు. శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతూ.. సంగారెడ్డిలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. ఎగిరి కిందపడగానే.. అదే సమయంలో నారాయణఖేడ్‌ వైపు వెళ్లే బస్సు గోపాలకృష్ణారెడ్డిని ఢీకొని.. పైనుంచి వెళ్లింది. తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. గోపాలకృష్ణారెడ్డికి భార్య స్వప్న, ఇద్దరు పిల్లలున్నారు. వారు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ వివరించారు.

సంగారెడ్డి గ్రామీణం: గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డాడు. ఎస్సై సుభాష్‌ తెలిపిన వివరాలు.. మండల పరిధి ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌ శివారులో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి  మృతి చెందారు. వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. మృతునికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు.


గుర్తుతెలియని మహిళ మృతి

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి పట్టణం విద్యానగర్‌ కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. గ్రామీణ ఎస్‌ఐ కె.సుభాష్‌ తెలిపిన వివరాలు.. 45-50 ఏళ్ల వయస్సున్న మహిళ మూడు రోజులుగా పట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో భిక్షాటన చేస్తోంది. రహదారి పక్కన పడుకొని అనారోగ్యానికి గురికాగా.. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని