logo

మితిమీరిన వేగం.. బలైన ప్రాణం

అతని వయసు 20 సంవత్సరాలు.. ఇంజినీరింగ్‌ విద్యార్థి.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు.. అద్దెకు తీసుకున్న కారును మితిమీరిన వేగంతో నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దుండిగల్‌ పోలీసుల కథనం ప్రకారం..

Published : 28 May 2022 01:49 IST

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా కారు నడిపిన ఇంజినీరింగ్‌ విద్యార్థి


ప్రమాదానికి కారణమైన కారు

దుండిగల్‌, న్యూస్‌టుడే: అతని వయసు 20 సంవత్సరాలు.. ఇంజినీరింగ్‌ విద్యార్థి.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు.. అద్దెకు తీసుకున్న కారును మితిమీరిన వేగంతో నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దుండిగల్‌ పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన యాదగిరి(50) బతుకుదెరువు నిమిత్తం గండిమైసమ్మ చౌరస్తా ప్రాంతానికి కుటుంబంతో కలిసి వలసొచ్చాడు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం గండిమైసమ్మచౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా దుండిగల్‌ నుంచి సూరారం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాహనంలో మరో ఐదుగురు.. గండిమైసమ్మచౌరస్తాలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మియాపూర్‌ వైపు యాదగిరి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తిని మిర్యాలగూడకు చెందిన ఉదయ్‌చరణ్‌(20)గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దుండిగల్‌లోని ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. అతనికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని తేలింది. అదే సమయంలో అతడు కారు అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో అతనితో పాటు మరో అయిదుగురు స్నేహితులున్నారు. కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని