logo

‘నేటితరం ఇంజినీర్లకు మోక్షగుండం స్ఫూర్తి ప్రదాత’

నేటి యువ ఇంజినీర్లకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తి ప్రదాత అని ఎంఏ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ మంత అన్నారు. గురువారం సాయంత్రం ఇంజినీర్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని అశోకా బిల్డర్స్‌

Published : 16 Sep 2022 02:36 IST

జాతీయ ఇంజినీర్స్‌ డే సింపోజియంలో మాట్లాడుతున్న రమేష్‌ మంత. చంద్రశేఖర్‌ బాబు, అజితేష్‌ కొరుపాలు, భూపతి శ్రీధర్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: నేటి యువ ఇంజినీర్లకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తి ప్రదాత అని ఎంఏ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ మంత అన్నారు. గురువారం సాయంత్రం ఇంజినీర్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని అశోకా బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌బీఎల్‌) ఆధ్వర్యంలో నేషనల్‌ ఇంజినీర్స్‌ డే సింపోజియం పేరిట సదస్సు నిర్వహించారు. మాదాపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన రమేశ్‌ మంత మాట్లాడుతూ.. సరైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో మోక్షగుండం అందించిన సేవలు అద్భుతమన్నారు. ఏఎస్‌బీఎల్‌ సీఈవో అజితేష్‌ కొరుపాలు మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ రంగంలో ఆధునిక పరిజ్ఞానంపై ఇంజినీర్లు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్టార్ట్‌ క్యాప్‌ కార్పొరేట్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకులు అనూజ్‌ కపూర్‌, వాసవి ఇంజినీరింగ్‌ కళాశాల సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధిపతి డా.భూపతి శ్రీధర్‌, ఇంక్రిస్‌ టెక్నాలజీ సీఐవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు