logo

ప్రముఖ కవి నిజాం వెంకటేశం హఠాన్మరణం

ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వెంకటేశం(74) గుండెపోటుతో మృతిచెందారు. సిరిసిల్లకు చెందిన వెంకటేశం విద్యుత్‌శాఖలో ఏడీఈగా ఉద్యోగ విరమణ

Published : 19 Sep 2022 03:55 IST

అడ్డగుట్ట, సికింద్రాబాద్‌ న్యూస్‌టుడే: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వెంకటేశం(74) గుండెపోటుతో మృతిచెందారు. సిరిసిల్లకు చెందిన వెంకటేశం విద్యుత్‌శాఖలో ఏడీఈగా ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‌ పద్మారావునగర్‌లో స్థిరపడ్డారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. జగిత్యాలలో పనిచేసే కాలంలో దిక్సూచి అనే కవితా పత్రికను ప్రారంభించి, ఎంతో మంది కొత్త, పాత కవులకు వేదికగా నిలిచారు. అల్లం రాజయ్య కథల సంకలనం ‘భూమి’ నవలతో పాటు పలువురి రచనలను ప్రచురితం చేశారు. 80వ దశకంలో తెలంగాణ కవిత్వానికి చిరునామగా నిలిచిన ఆయన అలిశెట్టి ప్రభాకర్‌, సుద్దాల అశోక్‌తేజ వంటి ఎంతోమంది యువ కవులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతికి ఆద్యకళ మ్యూజియాల సేకర్త, పరిశోధకులు జయధీర్‌ తిరుమలరావు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని