logo

ప్రాథమిక విద్య.. బలోపేతం!

సర్కార్‌ బడుల్లో విద్యా సామర్థ్యాలను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. నెల రోజుల నుంచి విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపుదలకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక విద్యా పర్యవేక్షణ అధికారిని

Published : 26 Sep 2022 02:40 IST

విద్యార్థుల చదువుల స్థాయిని పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, తాండూరు: సర్కార్‌ బడుల్లో విద్యా సామర్థ్యాలను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. నెల రోజుల నుంచి విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపుదలకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక విద్యా పర్యవేక్షణ అధికారిని నియమించారు. వీరికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

పటిష్ఠత కోసం కార్యాచరణ

జిల్లాలో ప్రతి మండలానికి మండల విద్యాధికారులు విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వీరే కాకుండా అదనంగా ఇటీవల జిల్లాలో 19 మంది నోడల్‌ అధికారులను నియమించారు. జిల్లాలో కాంప్లెక్స్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కూడా నోడల్‌ అధికారుల బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో 64 కాంప్లెక్స్‌ పాఠశాలలున్నాయి. వీరిని వారి పరిధిలో ఉన్న పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతలను అప్పగించారు. గతంలో ఈ బాధ్యతలు వీరికి ఉన్నప్పటికి పెద్దగా పట్టించుకోలేదు. వీరు కచ్చితంగా తనిఖీలు చేయాలని ఆదేశించటంతో కాంప్లెక్స్‌ నోడల్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వీరే కాకుండా ప్రతి కాంప్లెక్స్‌ పరిధిలో నల్గురు రిసోర్స్‌ పర్సన్‌లను ఉన్నారు. మండల స్థాయిలో 72 మంది రిసోర్స్‌ పర్సన్‌లను కొత్తగా నియమించారు. 59 మంది సీఆర్‌పీలున్నారు.

ఒకటి నుంచి 5వ తరగతి వరకు: జిల్లాలో 746 ప్రాథమిక పాఠశాలున్నాయి ఒకటో తరగతి నుంచి 5 వ తరగతి వరకు 53 వేల మంది విద్యార్థులున్నారు. కరోనా తర్వాత విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పూర్తిగా తగ్గాయని అధికారులు గుర్తించారు. దీంతో తాజా మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో సాధారణంగా తెలుగు, లెక్కలు, సామాన్య, సాంఘీక శాస్త్రంలో సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నారు.

మూడు రోజుల పాటు శిక్షణ

ప్రాథమిక విద్యను పటిష్ఠ పరచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యారంగంలో సామర్థ్యాల పెంపు కోసం నోడల్‌ అధికారులను నియమించాం. పాఠశాలలను తరచుగా తనిఖీలు చేయాలని చెప్పాం. విద్యారంగంలో కృషి చేసేందుకు పనిచేస్తున్న 450 మంది అధికారులకు మూడు రోజుల పాటు వికారాబాద్‌లో శిక్షణ ఇచ్చాం. - రవికుమార్‌, సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts