logo

అక్రమాలపై కమిటీ వేసి ఫిర్యాదు లేదని బుకాయింపు

దరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రంలో అవినీతికి సంబంధించి ఫిర్యాదు రాలేదంటూ సోమవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ దేవేశ్‌నిగమ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్‌సీయూలోని ఫార్మసీలో ఉద్యోగులు, పింఛనుదారులు,

Published : 27 Sep 2022 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రంలో అవినీతికి సంబంధించి ఫిర్యాదు రాలేదంటూ సోమవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ దేవేశ్‌నిగమ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్‌సీయూలోని ఫార్మసీలో ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబాలకు నెలవారీగా మందులు అందిస్తుంటారు. దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై గత పాలకమండలి సమావేశంలో చర్చించి విచారణకు కమిటీ వేశారు. అనూహ్యంగా రిజిస్ట్రార్‌ మాత్రం.. అవినీతి జరగలేదంటూ తాజాగా ప్రకటించడం విశేషం. మందుల కొనుగోళ్లలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని, బిల్లులన్నీ పరిశీలన తర్వాతే ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమాలకు ఆస్కారం లేకపోతే విచారణ కమిటీ ఎందుకు వేశారని యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని