logo

పోలీసుల తనిఖీల్లో చిక్కిన హవాలా సొమ్ము

హవాలా నగదుతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.86 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Published : 31 Jan 2023 04:10 IST

యువకుడి అరెస్ట్‌.. రూ.86లక్షలు స్వాధీనం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: హవాలా నగదుతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.86 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్‌ ఠాణా పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన నందమూరి మనోజ్‌ (30) సికింద్రాబాద్‌లో ఉంటున్నాడు. ఇతను స్థిరాస్తి, జువెలరీ వ్యాపారం చేసే రాణిగంజ్‌కు చెందిన వికాస్‌ఖానే అనే వ్యక్తి వద్ద పని చేస్తున్నాడు. సోమవారం యజమాని రూ.10 నోటును మనోజ్‌కు ఇచ్చి దానిని ఐఎస్‌సదన్‌ డివిజన్‌ శ్రీలక్ష్మీనగర్‌ కాలనీలో ఉండే నరేష్‌కు అందజేసి.. అతను ఇచ్చే నగదును తీసుకురావాలని ఆదేశించాడు. నరేష్‌ వద్ద నుంచి నగదు తీసుకున్న మనోజ్‌ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు దోబీఘాట్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. మనోజ్‌ వాహనాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన వెంట నగదు ఉందని, యజమాని చెప్పడంతోనే తీసుకెళ్తున్నానని పోలీసులకు చెప్పాడు. నగదు స్వాధీనం చేసుకున్న అదనపు ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు