logo

ఏప్రిల్‌ నాటికి వైద్య కళాశాల పనులు పూర్తి: కలెక్టర్‌

వికారాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు.

Published : 29 Mar 2023 02:21 IST

మాట్లాడుతున్న నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఇతర అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్విలతో కలిసి దృశ్య మాధ్యమంలో మాట్లాడారు. జిల్లా వైద్య కళాశాలపై కలెక్టర్‌ మాట్లాడుతూ తరగతి గదుల పనులు కొనసాగుతున్నాయని వచ్చే ఏప్రిల్‌ 15 నాటికి పూర్తి చేస్తారని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణంలో మొదటి, రెండో అంతస్తులో ప్లాస్టరింగ్‌, ఫ్లోరింగ్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ విద్యార్థుల వసతి గృహానికి అవసరమైన భవనాలను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ, జిల్లా వైద్యాధికారి పల్వన్‌కుమార్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ నాగమణి, ఈఈ శ్రీనివాసులు, డీఈలు రవీందర్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నియంత్రికల చుట్టూ కంచెలుండాల్సిదే..

జిల్లాలోని విద్యుత్తు నియంత్రికల చుట్టూ తప్పనిసరిగా కంచెలుండాలని, లేని వాటిని గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టాలని పాలనాధికారి విద్యుత్తు శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం పల్లె ప్రగతి, విద్యుత్తు, మిషన్‌ భగీరథ, సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ఆయన ఎంపీడీఓలు, ఎంపీపీలు, ఏపీఓలు, అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మతో కలిసి దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. కార్యక్రమంలో డీపీఓ తరుణ్‌కుమార్‌, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఈఓ రేణుకాదేవి, మిషన్‌ భగీరథ ఈఈ బాబుశ్రీనివాస్‌, ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ దేవరాజ్‌, అదనపు డీఆర్‌డీఓ స్టీవెన్‌నిల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని