logo

Hyderabad: దిగొస్తున్న టమాటా

నగరానికి టమాటా రాక పెరుగుతోంది. రైతుబజారులో కిలో టమాటా రూ.63లు ఉంటే.. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు.

Updated : 08 Aug 2023 08:25 IST

రైతుబజార్లో  కిలో రూ. 63

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి టమాటా రాక పెరుగుతోంది. రైతుబజారులో కిలో టమాటా రూ.63లు ఉంటే.. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. నగరానికి 10రోజుల కిందట కేవలం 850 క్వింటాళ్ల సరకు వస్తే.. సోమవారం 2450 క్వింటాళ్లు హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది. ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి నగరానికి దిగుబడి వస్తోంది. దీనికి తోడు రంగారెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్‌ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటా ఎక్కువ మొత్తంలో రావడమే ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు కిలో రూ.50లోపు దొరికే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు అంటున్నారు.

వ్యాపారుల మాయాజాలం

నగరానికి వస్తున్న టమాటా దిగుబడి మేరకు హోల్‌సేల్‌ మార్కెట్లో డిమాండ్‌ ఆధారంగా వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి మొదటి, రెండో రకంగా విభజించి ధర నిర్ణయించి రైతుబజార్లలో ఆ ప్రకారమే అమ్మాలని ఆదేశిస్తారు. వ్యాపారులు మాత్రం అన్ని రకాలకు ఒకే ధర తీసుకుంటున్నారు. ధరల పట్టిక మాత్రం మొదటి రకానిదే మార్కెట్లో ప్రదర్శిస్తారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కిలో మొదటి రకం టమాటా రూ. 63గా నిర్ధారించి బోర్డులు రైతుబజార్లలో పెట్టినా అక్కడ శాశ్వత దుకాణదారులు కిలో రూ.100కు తగ్గకుండా అమ్ముతున్నారు. ఎస్టేట్‌ అధికారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని మెహిదీపట్నం రైతుబాజరుకు వెళ్లిన ప్రమోదరావు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని