logo

56 ఏళ్లలో ఒక్కసారే మహిళా ప్రాతినిధ్యం

కంటోన్మెంట్‌ 1967లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ 56 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే ఇక్కడి నుంచి మహిళకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది.

Published : 05 Nov 2023 05:35 IST

కంటోన్మెంట్‌ 1967లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ 56 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే ఇక్కడి నుంచి మహిళకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వి.రామారావు విజయం సాధించారు. రామారావు మరణంతో ఆయన భార్య మణెమ్మ 1972  ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థి బి.మశ్చేందర్‌ ఎన్నిక కాగా.. తెదేపా ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. 1983లో తెదేపా అభ్యర్థి డాక్టర్‌ ఎన్‌ఏ కృష్ణ, 1985 మధ్యంతర ఎన్నికల్లో తెదేపా నుంచి బరిలో ఉన్న సర్వే సత్యనారాయణ గెలుపొందారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి డి.నర్సింగ్‌రావు గెలుపొందగా 1994, 1999, 2004లో తెదేపా అభ్యర్థి సాయన్న హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి పి.శంకర్‌రావు, 2014లో సాయన్న తెదేపా నుంచి, 2018లో భారాస నుంచి ఎన్నికయ్యారు. 1967 నుంచి 2018 వరకూ 11సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఒక్కసారి మాత్రమే మహిళకు అవకాశం దక్కింది.

 న్యూస్‌టుడే, అల్వాల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని