logo

యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌నారాయణ సూచించారు.

Published : 28 Mar 2024 03:18 IST

మాట్లాడుతున్న జయప్రకాశ్‌ నారాయణ

రాయదుర్గం, న్యూస్‌టుడే: యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌నారాయణ సూచించారు. యువతలో నాయకత్వల పెంపొందించి సాధికారిత సాధించేలా ప్రోత్సహించే ‘వాటీజ్‌ మై గోల్‌’ (నా లక్ష్యం ఏంటీ) సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అండర్‌ 18 అసెంబ్లీ సభ్యుల(విద్యార్థి ఎమ్మెల్యేల)కు రాయదుర్గం టీహబ్‌లో బుధవారం తొలి దశ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై యువత అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.  

60 పాఠశాలల విద్యార్థులకు.. వాటీజ్‌ మైగోల్‌ అండర్‌ 18 చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ చిత్రాలి శర్మ మాట్లాడుతూ.. 60 పాఠశాలలకు చెందిన విద్యార్థి ఎమ్మెల్యేలకు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు.  సంస్థ ప్రతినిధి కార్తికేయ వంకినేని మాట్లాడుతూ.. మొత్తం 105 పాఠశాలల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలున్నారని, వారు 1.4లక్షల మంది విద్యార్థుల(ఓటర్లు)కు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎన్నికల్లో మూడు పార్టీల్లో ఒక పార్టీకి చెందిన వర్దన్‌ అనే విద్యార్థి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడన్నారు.  అగస్త్య, కింగ్‌, మిత్ర, మాన్వి, శశ్రిక, భవ్య, శ్రీధన్‌, షఫియ, సన్ని, వర్షిత్‌ బృందం కార్యక్రమాలను పర్యవేక్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని