logo

బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ

లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్‌ సదన్‌ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 18 Apr 2024 03:40 IST

ఐఎస్‌ సదన్‌, న్యూస్‌టుడే: లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్‌ సదన్‌ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 14న రాత్రి 11 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ ఒవైసీ ఆసుపత్రి వంతెన మీద నుంచి కిందకు దిగే సమయంలో కింది రోడ్డు నుంచి ఎల్బీనగర్‌ వైపు వెళ్తున్న ఈదిబజార్‌ ప్రాంతానికి చెందిన ద్విచక్ర వాహనాదారుడు అబ్దుల్‌ మాజీద్‌ని ఢీకొట్టింది. ఆయన కింద పడిపోయారు. గాయాలు కాలేదు. ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రం కింద ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు కొంతమంది లారీ డ్రైవర్‌ పృథ్వీరాజ్‌ని పట్టుకోవడానికి యత్నిస్తూ.. ఒకరు లారీ క్యాబిన్‌ ఎక్కారు. కొడతారనే భయంతో లారీని మరింత వేగంగా తీసుకెళ్లడంతో క్యాబిన్‌ పట్టుకొని ఉన్న యువకుడు అలాగే నిల్చొనిపోయాడు. ముందు చక్రంలో ఇరుక్కున్న వాహనాన్ని దాదాపు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. చంపాపేట చౌరస్తా వద్ద మరో కారును ఢీకొట్టి వనస్థలిపురం ట్రాఫిక్‌ ఠాణా ఎదుట లారీని నిలిపివేశాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని