logo

గ్రేటర్‌ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు

గ్రేటర్‌ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 18 Apr 2024 04:21 IST

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరణించిన వారి ఓట్లు 47,141, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారివి 4,39,801, డూప్లికేట్‌ ఓట్లు 54,259 ఉన్నట్లుగా గుర్తించి తొలగించి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఓటరు జాబితాలో ఇంటి నంబర్ల అవకతవకలను గుర్తించి మొత్తం 1,81,405 ఓటర్ల వివరాల్లో సవరణలు చేసినట్టు పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా సికింద్రాబాద్‌ (31,042), కంటోన్మెంట్‌ (22,732), సనత్‌నగర్‌ (20,226) యాకుత్‌పురా (19,999), ముషీరాబాద్‌ (19,700), జూబ్లీహిల్స్‌ (14,429)లోనే ఉన్నాయని వెల్లడించారు. దీంతో పాటు డూప్లికేట్‌, పీఎస్‌ఇ (ఫొటో సిమిలర్‌ ఎంట్రీ), డీఎస్‌ఇ (డెమోగ్రఫీ సిమిలర్‌ ఎంట్రీ)లను గుర్తించి తొలగించినట్టు తెలిపారు. వేర్వేరు పోలింగ్‌స్టేషన్లలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి వారిని ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి వచ్చేలా సవరణలు చేసి ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 3,78,713 ఓటర్లకు సంబంధించి మార్పులు చేసినట్టు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని