logo

కాంగ్రెస్‌ నేత హత్య కేసులో నిందితుడి కోసం పోలీసుల గాలింపు

అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇందిరానగర్‌ చౌరస్తాలో హత్యకు గురైన కాంగ్రెస్‌ నాయకుడు మక్బూల్‌ అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.

Published : 06 May 2024 03:49 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇందిరానగర్‌ చౌరస్తాలో హత్యకు గురైన కాంగ్రెస్‌ నాయకుడు మక్బూల్‌ అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. మృతుడి బంధువులు, స్థానికులు ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశాలున్నాయని భావించి పోలీసులు కట్టుదిట్టంగా భద్రత చేపట్టారు. హంతకుడిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుడు అమ్జద్‌, హత్యకు గురైన మక్భూల్‌తో సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఇద్దరు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ ఎన్నికల సమయంలోనే అమ్జద్‌ ఎంఐఎం పార్టీలో చేరినట్లు సమాచారం. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది. ఇటీవల వీరి మధ్య బస్తీలో ఆధిపత్య పోరు నడిచిందని, ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా మక్బూల్‌పై అమ్జద్‌ కోపం పెంచుకున్నట్లు సమాచారం. దీంతో శనివారం రాత్రి కాంగ్రెస్‌ సమావేశానికి మక్బూల్‌ ఏర్పాట్లు చేస్తుండగా అమ్జద్‌ అతడిపై దాడిచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని