logo
Published : 03/12/2021 02:38 IST

‘నా ఆత్మహత్యకు కారణం వేధింపులే’

 వైరల్‌గా మారిన వీడియో

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కష్టాల్లో ఉన్న సమయంలో తీసుకున్న అప్పు చెల్లించపోవడంతో సమీప బంధువు వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ ఓ వివాహిత తన బాధను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్‌గా మారింది. బాధిత మహిళ వీడియో ద్వారా చెప్పిన వివరాల మేరకు...తిమ్మాపూర్‌ మండలం పొగాకులపల్లెకు చెందిన కనకయ్య వద్ద కరీంనగర్‌లోని కాపువాడలో అద్దెకు ఉంటున్న ముంజం రాజు, అరుణలు మేనెలలో నోటిమాట కింద రూ.10 వేలను అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పు చెల్లించేందుకు ఇబ్బంది ఏర్పడటంతో వాయిదా పద్ధతిలో చెల్లిస్తామని చెప్పినా అతను వినలేదని, అప్పు తీర్చకున్నా ఫరవాలేదని... మరో విధంగా వేధించాడని అరుణ ఆరోపించింది. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కనకయ్య వేధించాడని వివరిస్తూ వీడియో రికార్డు చేసిన అనంతరం ఆరుణ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనకయ్యపై కేసు నమోదు చేసినట్లు ఒకటో ఠాణా పోలీసులు తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని