logo
Published : 03/12/2021 02:38 IST

జన జాగృతం.. యంత్రాంగం సన్నద్ధం

 ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
 జిల్లాలో వేగంగా టీకా పంపిణీ ప్రక్రియ
 ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
 జిల్లాలో వేగంగా టీకా పంపిణీ ప్రక్రియ

న్యూస్‌టుడే, పెద్దపల్లి

కరోనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తితో సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సన్నద్ధత చర్యలపై జిల్లాలో అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వైరస్‌ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వస్తే ఏ విధంగా స్పందించాలి? అనే అంశాలపై ప్రజలను జాగృతం చేసేందుకు రెండు రోజులుగా అధికారులు కార్యాచరణ ప్రారంభించారు.

టీకా వేస్తున్న దృశ్యం

వైరస్‌ను ఎదుర్కొనేందుకు వంద శాతం వ్యాక్సినేషన్‌ దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్లి టీకా వేయించుకోవాలంటూ ప్రజలను జాగృతం చేస్తున్నారు. మరోవైపు రెండో డోసు ప్రక్రియను వేగవంతం చేశారు. కొవిషీల్డు టీకా తీసుకుని 84 రోజులు, కొవాగ్జిన్‌ వేయించుకుని 30 రోజులు పూర్తయిన వారు రెండో డోసు వేయించుకునేలా ఆరోగ్య సిబ్బంది ఫోన్‌ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఒక్క డోసు కూడా పొందని వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వినియోగించడంపై ప్రజలకు సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
అన్నీ ఆక్సిజన్‌ పడకలే..
కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లాలోని వివిధ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధునికీకరించింది. వీటిలో దాదాపు అన్ని ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఆస్పత్రులను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని సామాజిక వైద్యశాలల పడకలను ఆక్సిజన్‌ ప్లాంట్లతో అనుసంధానించారు. సుల్తానాబాద్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో 42, గోదావరిఖనిలో 50, మంథనిలో 50, పెద్దపల్లిలో 74 ఆక్సిజన్‌ పడకలున్నాయి. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో నిర్మాణ ఆర్గనైజేషన్‌ సంస్థ సహకారంతో 10 ఐసీయూ పడకలను సిద్ధంగా ఉంచారు. గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రిలో 173 ఆక్సిజన్‌ పడకలు, 20 ఐసీయూ పడకలున్నాయి. సుల్తానాబాద్‌లోని ప్రసూతి వైద్యశాలలో 20 పడకలను కొవిడ్‌ బారిన పడిన గర్భిణుల కోసం అదనంగా కేటాయిచారు.
115 గ్రామాలు.. 37 కాలనీలు
18 సంవత్సరాలకు పైబడిన వయోజనులకే ఇస్తున్న వ్యాక్సిన్‌ ప్రక్రియ జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 115 గ్రామాలు, 37 కాలనీల్లో మొదటి డోసు నూరు శాతం పూర్తయింది. రెండో డోసు కూడా లక్ష్యం మేర పూర్తి చేసేందుకు అధికారులు గ్రామాల్లో ప్రత్యేక వాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 5,55,531 మందికి టీకా వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు మొదటి డోసు 5,19,136 మందికి, రెండో డోసు 2,63,176 మందికి పూర్తి చేశారు. మిగిలిన వారిలో 12 శాతం మందికి మొదటి డోసు, 49.73 శాతం మందికి రెండో డోసు వేయాల్సి ఉంది. వీరికి కూడా టీకాలు వేసి, నూరు శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని